తెలుగులోకి మరో రీమేక్ .. కీలకపాత్రలో రావు రమేశ్?
- క్రితం నెలలో విడుదలైన 'కర్ణన్'
- ధనుశ్ కి హిట్ తో పాటు ప్రశంసలు
- 'లాల్' పాత్రలో రావు రమేశ్
ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ శ్రీనివాస్ తీసుకున్నాడు. ఆయన హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. 'కర్ణన్'లో కథానాయకుడికి మార్గదర్శకుడిగా నిలిచే ఒక కీలకమైన పాత్రలో 'లాల్' నటించారు. కథాపరంగా ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రను తెలుగులో రావు రమేశ్ తో చేయించాలని అనుకుంటున్నారట. అందుకోసం సంప్రదింపులు నడుస్తున్నాయని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.