అల్లు శిరీష్ బర్త్ డే కానుకగా రానున్న ఫస్టులుక్!
- గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో లవ్ స్టోరీ
- అల్లు శిరీష్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్
- త్వరలోనే పూర్తి వివరాలు
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శిరీష్ జోడిగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. ఈ రోజున ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. రేపు శిరీష్ పుట్టినరోజు కావడంతో, ఉదయం 11 గంటలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నామనే విషయాన్ని ప్రీ లుక్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.