తెలంగాణలో కొత్తగా 3,762 కరోనా కేసులు

  • 24 గంటల్లో 20 మంది మృతి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 528 కేసులు
  • ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,189
తెలంగాణలో కొత్తగా మూడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,762 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 3,816 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 20 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,189కి చేరింది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 528 మంది కరోనా బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 229 మంది, నల్గొండ జిల్లాలో 218 మంది, ఖమ్మం జిల్లాలో 214 మంది కరోనా బారిన పడ్డారు.

Telangana
Corona Virus
Updates

More Telugu News