హరీశ్ మూవీలో రెండు డిఫరెంట్ పాత్రల్లో పవన్ !
- పవన్ తో మళ్లీ హరీశ్ శంకర్
- జూలై నుంచి సెట్స్ పైకి
- లెక్చరర్ గా కనిపించనున్న పవన్
- మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్
ఒక పాత్రలో కాలేజ్ లెక్చరర్ గా .. మరో పాత్రలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ రెండు పాత్రలను హరీశ్ శంకర్ డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం కాలేజ్ సెట్ వేయనున్నారనే టాక్ వచ్చినప్పుడే, లెక్చరర్ గా గానీ, ప్రొఫెసర్ గా గాని పవన్ కనిపించవచ్చని అనుకున్నారు. కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కూడా ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.