మెహుల్ చోక్సీ పారిపోయినట్టు ఆధారాలు లేవు: అంటిగ్వా ప్రధాని
- చోక్సీ అంటిగ్వాలోనే ఎక్కడో ఉండి ఉంటారు
- సముద్ర, వాయు మార్గాల్లో వెళ్లే అవకాశం లేదు
- పార్లమెంటుకు తెలిపిన అంటిగ్వా ప్రధాని
చోక్సీ పరారీ విషయమై ప్రధాని బ్రౌనీ పార్లమెంటులో మాట్లాడుతూ.. చోక్సీ క్యూబాకు పారిపోయినట్టు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. దేశంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానం ద్వారా పారిపోయే అవకాశం లేదని, సముద్ర మార్గం ద్వారా వెళ్లి ఉంటే ఆ విషయం ఇప్పటికే తమకు తెలిసి ఉండేదని వివరించారు. కాబట్టి చోక్సీ ఇక్కడే ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. చోక్సీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.