టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
- ఇటీవల మరణించిన ఇందూ జైన్
- కరోనా ఇన్ఫెక్షన్ తో మృతి
- వర్చువల్ విధానంలో సంస్మరణ కార్యక్రమం
- నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
కొన్నిరోజుల కిందట కరోనా బారిన పడిన ఇందూ జైన్ కు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ఆమె కోలుకోలేకపోయారని టైమ్స్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఫిక్కీ మహిళల విభాగం స్థాపనలోనూ, టైమ్స్ ఫౌండేషన్ పేరిట దాతృత్వ సేవలకు ఇందూ జైన్ ఆద్యురాలు. ఆమెకు ఆధ్యాత్మిక భావనలు మెండు.
ఆమె 1936లో ఓ జైన కుటుంబంలో జన్మించారు. ఆమె అశోక్ కుమార్ జైన్ ను పెళ్లాడారు. అశోక్ కుమార్ టైమ్స్ గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన మరణానంతరం ఇందూ జైన్ సంస్థ బాధ్యతలను పర్యవేక్షించారు.