భారత్ లో తగ్గుముఖం పట్టిన కరోనా.. 2 లక్షల దిగువకు కొత్త కేసులు!
- 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసుల నమోదు
- ఇదే సమయంలో 3,26,850 మంది డిశ్చార్జ్
- దేశ వ్యాప్తంగా 3,511 మంది మృతి
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకుని 3,26,850 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 3,511 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 2,69,48,874 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,40,54,861 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 3,07,231కి చేరింది. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,85,38,999 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. లాక్ డౌన్లు మరికొంత కాలంపాటు కొనసాగితే కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.