v.srinivas goud: మహబూబ్‌నగర్‌లో రూ.5కే కరోనా మృతులకు దహన సంస్కారాలు: మంత్రి శ్రీనివాసగౌడ్

Cremation for Rs 5 in Mahbubnagar dist
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయిన వారికి 5 రూపాయలకే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ మంత్రి వి.శ్రీనివాసగౌడ్ తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో రెండు ఎకరాల స్థలంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే శ్శశాన వాటిక పనులు పూర్తయి అందుబాటులోకి వస్తుందన్నారు. మునిసిపల్ కమిషనర్‌కు రూ. 5 చెల్లించడం ద్వారా అక్కడ అంత్యక్రియలు చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
v.srinivas goud
Telangana
Corona Virus
Mahbubnagar District

More Telugu News