మీ వివరణ సరిపోదు... మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే: బాబా రాందేవ్ కు స్పష్టం చేసిన కేంద్రం
- అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు
- దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం
- భగ్గుమన్న వైద్య వర్గాలు
- వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన రాందేవ్
- రెండు పేజీల లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
"అల్లోపతి వైద్యంపై మీరు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ విషయాన్ని మీకు ఇప్పటికే ఫోన్ ద్వారా తెలియజేశాను. ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిని దేశ ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు. మీరు కరోనా వారియర్స్ ను మాత్రమే అవమానించలేదు... యావత్ ప్రజానీకం మనోభావాలను గాయపరిచారు. మీరు నిన్న ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదు. మీరు దీనిపై గట్టిగా ఆలోచించి, మీ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు బాబా రాందేవ్ కు హిందీలో రెండు పేజీల లేఖ రాశారు.