ఏపీలో కొత్తగా 20,937 మందికి కరోనా నిర్ధారణ
- గత 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరిలో 3,475 కేసులు
- చిత్తూరు జిల్లాలోనూ 3 వేలకు పైగా కొత్త కేసులు
- రాష్ట్రంలో 104 మంది మృతి
- కరోనా నుంచి కోలుకున్న వారు 20,811 మంది
రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది.