ఆనందయ్య కరోనా మందు పంపిణి నిలిపివేత.. కలెక్టర్ ప్రకటన
- నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ
- కరోనాను కట్టడి చేస్తుందంటూ ప్రచారం
- ప్రజల నుంచి విశేష స్పందన
- శాస్త్రీయ అధ్యయనం జరగాలన్న సీఎం జగన్
- మందు శాంపిళ్లను హైదరాబాద్ పంపిన అధికారులు
మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.