కరోనా వేళ పెళ్లిళ్లు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇవ్వండి.. దీంతో నా గర్ల్ ఫ్రెండ్ పెళ్లి కూడా ఆగిపోతుంది: బీహార్ సీఎంకు యువకుడి ట్వీట్
- వైరల్ అవుతోన్న ట్వీట్
- సెటైర్లు వేస్తోన్న నెటిజన్లు
- ప్రియురాలి పెళ్లిని ఆపేందుకు యువకుడి ట్వీట్
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని వివాహ వేడుకలను వాయిదా వేయాలని ఆదేశించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ట్వీట్ ద్వారా ఆయన కోరాడు. వివాహాలపై నిషేధం విధిస్తే, తన ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నాడు.
అలా చేస్తే సీఎంకు తాను రుణపడి ఉంటానని చెప్పాడు. ప్రియురాలి వివాహం ఆపేందుకు మంచి ప్లాన్ వేశావంటూ అతడిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కరోనా వేళ విధించిన లాక్డౌన్ గర్ల్ ఫ్రెండ్లు వదిలించుకున్న బాయ్ ఫ్రెండ్లకు ఇలా ఉపయోగపడుతోందని జోకులు వేస్తున్నారు.