రేపు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్న సీఎం జగన్
- ఉండవల్లి కరకట్ట విస్తరణకు రేపు శంకుస్థాపన
- పాల్గొంటున్న సీఎం జగన్
- కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద భూమిపూజ
- రూ.150 కోట్ల వ్యయంతో పనులు
రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, సమావేశాలకు వెళ్లే ముందు సీఎం ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ రోడ్డు విస్తరించడం వల్ల ఇబ్రహీంపట్నం, వెంకటపాలెం మధ్య నిర్మించే ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించ తలపెట్టిన బైపాస్ రోడ్ అనుసంధానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.