ఏపీలో కరోనా స్వైరవిహారం... మరోసారి 100కి పైగా మరణాలు
- గత 24 గంటల్లో ఏపీలో 106 మంది మృతి
- పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది కన్నుమూత
- 9,686కి చేరిన మొత్తం మరణాలు
- తాజాగా ఏపీలో 23,160 మందికి పాజిటివ్
- తూర్పుగోదావరి జిల్లాలో 3,528 కొత్త కేసులు
తాజాగా 1,01,330 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 3,528 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,670 కేసులు, అనంతపురం జిల్లాలో 2,334 కేసులు, విశాఖ జిల్లాలో 2,007 కేసులు గుర్తించారు. ఒక్క విజయనగరం జిల్లా (945) మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 1000కి పైన పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా...
ఏపీలో ఇప్పటివరకు 14,98,532 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 12,79,110 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.