పవన్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్!
- పవన్ తో రెండు సినిమాలు
- బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్'
- మూడో సినిమాకి సన్నాహాలు
దాంతో పవన్ .. బండ్ల గణేశ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తనతో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చాడనీ, కానీ ఇంకా తాను అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టలేదని గణేశ్ అప్పుడే చెప్పాడు. ఈ నేపథ్యంలో రమేశ్ వర్మ ఒక కథతో పవన్ ను ఒప్పించాడనీ, ఆ సినిమాకి నిర్మాత గణేశ్ అనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన గణేశ్, ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నాడు. గణేశ్ నుంచి త్వరలో అలాంటి ప్రకటన వస్తుందేమో చూడాలి మరి!