కర్ఫ్యూ టైమింగ్ మారిందనే వార్తల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం
- ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే ఆంక్షల సడలింపు అంటూ ప్రచారం
- కర్ఫ్యూ సమయంలో మార్పులు చేయలేదన్న ప్రభుత్వం
- తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
కర్ఫ్యూ సమయాల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఉన్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని చెప్పింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.