స్టాలిన్ ఆదేశాలతో బాధితుడికి జరిమానా డబ్బును వెనక్కి ఇచ్చిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టాలిన్ ఆదేశాలతో బాధితుడికి జరిమానా డబ్బును వెనక్కి ఇచ్చిన పోలీసులు

Police repaid fine amount to a man with the orders of Stalin
  • హెల్మెట్ లేదంటూ రూ. 500 జరిమానా విధించిన పోలీసులు
  • దీంతో కొడుక్కి మందులు కొనలేకపోయిన బాధితుడు
  • ట్విట్టర్ ద్వారా స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లిన వైనం
ముఖ్యమంత్రి ఆదేశాలతో తాము వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లి తిరిగిచ్చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తిరువళ్లూర్ జిల్లా సెవ్వాపేట సమీపంలోని సిరుకూడల్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల బాలచంద్రన్ కుమారుడు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కొడుక్కి మందులు కొనుగోలు చేసేందుకు గత శుక్రవారం తిరువళ్లూర్ వచ్చాడు. అదే సమయంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు హెల్మెట్ లేదంటూ బాలచంద్రన్ కు రూ. 500 జరిమానా విధించారు.

అయితే, తన కొడుక్కి మందులు కొనేందుకు తన వద్ద కేవలం రూ. 1,000 మాత్రమే ఉన్నాయని, తనకు జరిమానా విధించవద్దని పోలీసులను బాలచంద్రన్ వేడుకున్నాడు. అయినా కనికరించని పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించడంతో... మందులు కొనుక్కోకుండానే అతను ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన స్టాలిన్... జరిమానాను వెనక్కి ఇచ్చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అనంతరం బాలచంద్రన్ ఇంటికి వెళ్లిన తిరువళ్లూర్ తాలూకా సీఐ జరిమానా కింద వసూలు చేసిన రూ. 500 చెల్లించి క్షమాపణ కోరారు. మరోవైపు, తన విన్నపం పట్ల తక్షణమే స్పందించిన స్టాలిన్ కు బాలచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు.
Stalin
Tamilnadu
Helmet
Fine

More Telugu News