ర‌ష్యా నుంచి హైద‌రాబాద్ చేరుకున్న 1.50 లక్షల డోసుల స్పుత్నిక్-వీ వ్యాక్సిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ర‌ష్యా నుంచి హైద‌రాబాద్ చేరుకున్న 1.50 లక్షల డోసుల స్పుత్నిక్-వీ వ్యాక్సిన్

sputnik v reaches hyderabad
  • ఇటీవ‌ల‌ ఫస్ట్‌బ్యాచ్ దిగుమ‌తి
  • ఇప్పుడు రెండో బ్యాచ్‌
  • రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలింపు
  • దేశానికి ర‌ష్యా నుంచి రావాల్సిన డోసులు మొత్తం 67 లక్షలు
ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఫస్ట్‌బ్యాచ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, అక్క‌డి నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు దానిని త‌ర‌లించిన‌ విష‌యం తెలిసిందే. ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకుంటోన్న ఈ వ్యాక్సిన్ రెండో బ్యాచ్ నేడు హైదరాబాద్ కు చేరింది.

మొత్తం 1.50 లక్షల డోసులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. అక్కడికి నుంచి వీటిని రెడ్డీస్‌ ల్యాబ్‌కు తరలించారు. దేశానికి ర‌ష్యా నుంచి మొత్తం 67 లక్షల డోసులు చేరుకోనున్నాయి. వాటిల్లో భాగంగానే విడ‌తల వారీగా స్పుత్నిక్-వీ వ‌స్తోంది. అంతేగాక‌, వ‌చ్చే నెల‌ నుంచి దేశంలోనే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను రెడ్డీస్‌ ల్యాబ్ ఉత్ప‌త్తి చేయ‌నుంది.

స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్ప‌టికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దిగుమ‌తి చేసుకున్న స్పుత్నిక్-వీ ఒక్కో డోస్ ధర రూ.995గా ఉంటుంది. దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌య్యాక దాని ధ‌ర త‌‌గ్గ‌నుంది.

Sputnik V
Hyderabad
vaccine

More Telugu News