SparkOTT: ప్రెస్ నోట్: మరికొన్ని గంటల్లో స్పార్క్ ఓటీటీ ఎంట్రీ... ఓటీటీ వరల్డ్ లో ప్రభంజనమే

Spark OTT Live in Few Hours Promises To Revolutionise The OTT Space


ప్రెస్ నోట్:  మరికొన్ని గంటల్లో స్పార్క్ ఓటీటీ సరికొత్తగా వినోద రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. భారత ఓటీటీ రంగంలో సరికొత్తగానే కాకుండా అన్ని రకాల ప్రేక్షకుల డిమాండ్లను తీర్చేలా స్పార్క్ ఓటీటీ రగంలోకి దిగబోతోంది. భారత ఓటీటీ మార్కెట్ లో (OTT Platform) పెను ప్రభంజనం సృష్టించేలా స్పార్క్ ఓటీటీని రూపుదిద్దిన‌ట్లు ఆ సంస్థ అధినేత‌, యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరు ఘ‌నంగా ప్ర‌క‌టించారు.
 
ఈ నెల 15వ తేదీన (అంటే... నేటి అర్ధ‌రాత్రి) భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘డీ కంపెనీ’ ప్రసారంతో స్పార్క్ ఓటీటీ (Spark OTTసేవలు ప్రారంభం కానున్నాయి. ఓటీటీ రంగంలో ఇప్పటికే చాలా సంస్థలే ఉన్నా.. స్పార్క్ ఓటీటీ తనదైన శైలి ఒరిజినల్ వెబ్ సిరీస్, ఐదు భాషలకు చెందిన సంచలన చలన చిత్రాలతో తనదైన ముద్రను వేయనుందని సాగర్ మాచనూరు తెలిపారు.
 
దర్శన నిర్మాత రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వర్మ ప్రాజెక్టులతో పాటు స్పార్క్ ఓటీటీ... తన సొంత కథాకథనాలతో రూపొందించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలకు చెందిన పాపులర్ చిత్రాలను కూడా ప్రసారం చేయనుంది. వీటిలో ‘దిశ ఎన్ కౌంట‌ర్‌’, సునీల్ రూపొందించిన ‘క‌న‌బడుట‌లేదు’, క్యాబ్ స్టోరీస్‌, వ‌ర్మ రూపొందించ‌నున్న ‘ఇది మ‌హాభార‌తం కాదు’, దేశంలోనూ తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ చిత్రం ‘డేంజరస్’, ఆర్జీవీ మిస్సింగ్, టాబ్లెట్, రామూఇజమ్ సిరీస్ విత్ స్వప్న.. తదితరాలు స్పార్క్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి.
 
'స్పార్క్' ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
 
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
 
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి:
 https://www.sparkott.com/
 

Press release by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News