టాలీవుడ్ లో మరో విషాదం.. కరోనాతో డైరెక్టర్ నంద్యాల రవి మృతి
- కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన రవి
- ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- పలు చిత్రాలకు రచయితగా కూడా పని చేసిన రవి
పలు చిత్రాలకు నంద్యాల రవి రచయితగా పని చేశారు. 'లక్ష్మీ రావే మా ఇంటికి' అనే సినిమాను డైరెక్ట్ చేశారు. సప్తగిరితో ఓ సినిమాను చేసేందుకు కూడా కథను రెడీ చేసుకున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను బలితీసుకుంది. నంద్యాల రవి మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.