సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా

UPSC postpones Civil Services prelims
  • స్వైరవిహారం చేస్తున్న కరోనా
  • జూన్ 27న జరగాల్సిన ప్రిలిమ్స్
  • ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు జరపలేమన్న యూపీఎస్సీ 
  • అక్టోబరు 10కి వాయిదా
అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతున్న కరోనా రక్కసి కారణంగా దేశంలో అత్యున్నత సర్వీసుల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. జూన్ 27న నిర్వహించాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వాయిదా వేసింది.

కరోనా విసృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో పరీక్షలు జరుపలేమని యూపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలను అక్టోబరు 10న జరిపేందుకు రీషెడ్యూల్ చేసినట్టు తెలిపింది. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే పలు కీలక పరీక్షలు వాయిదా పడడం తెలిసిందే.
UPSC
Prelims
Civil Services
Corona Pandemic

More Telugu News