తెలంగాణలో మరో 4,801 మందికి కరోనా పాజిటివ్
- తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
- గత 24 గంటల్లో 75,289 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 756 కేసులు
- రాష్ట్రంలో 32 మంది మృతి
- ఇంకా 60,136 మందికి చికిత్స
ఇప్పటివరకు రాష్ట్రంలో 5,06,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,44,049 మంది కోలుకున్నారు. ఇంకా 60,136 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,803కి పెరిగింది.
కరోనా మరణాల శాతం జాతీయస్థాయిలో 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.55 శాతంగా నమోదైంది. రికవరీ రేటులోనూ తెలంగాణ మెరుగ్గానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 82.7 శాతం కాగా, తెలంగాణలో అది 87.58 శాతంగా ఉంది.