హైదరాబాదులో కాంగ్రెస్ నేత భట్టి నివాసానికి వెళ్లిన ఈటల
- ఈటలపై భూకబ్జా ఆరోపణలు
- మంత్రి పదవిని పోగొట్టుకున్న వైనం
- రాజకీయ భవితవ్యంపై అనుచరులతో చర్చ
- ఈ మధ్యాహ్నం భట్టితో సమావేశం
నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లిన ఈటల ఆయనతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో, పలు పార్టీలకు చెందిన రాజకీయనేతలను కలిసి చర్చలు జరిపేందుకు ఈటల నిర్ణయించుకున్నారు. ఈ భేటీలు ముగిసిన తర్వాత తన రాజకీయ భవితవ్యంపై త్వరలోనే ఈటల నుంచి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.