రుయా ఆసుపత్రి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
- తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోరం
- ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
- మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదేశం
గత రాత్రి రుయా ఆసుపత్రిలో ప్రాణవాయువు నిల్వలు అడుగంటిన సమయంలో చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడంతో ఈ ఘోరం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అంటున్నారు.