తెలంగాణలో మరో 4,826 కరోనా పాజిటివ్ కేసులు, 32 మరణాలు

  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 65,923 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 723 కొత్త కేసులు
  • అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 5 కేసులు
  • రాష్ట్రంలో మరింత పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,923 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,826 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 723 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 5 కేసులు గుర్తించారు. అదే సమయంలో 7,754 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 32 మంది మరణించారు.

తెలంగాణలో ఇప్పటివరకు 5,02,187 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,36,619 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కరోనా మరణాల సంఖ్య 2,771కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 82.3 శాతం కాగా, తెలంగాణలో 86.94 శాతానికి పెరిగింది.

Telangana
Corona
Update
Media Bulletin
Positive Cases
Deaths
Recovery Rate

More Telugu News