జగన్ కు సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదు: లోకేశ్
- మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం అమలు
- కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తొక్కిసలాటలు
- తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్
- ప్రజలను దొమ్మీకి వదిలేశారని ఆగ్రహం
- కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని మండిపాటు
మద్యం దుకాణాల వద్ద క్యూలు ఏర్పాటు చేసి భౌతికదూరం అమలు చేస్తున్నారని, కరోనా నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలను మాత్రం దొమ్మీకి వదిలేశారని మండిపడ్డారు. తద్వారా మరింతగా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చోటు చేసుకున్న వివిధ ఘటనల వీడియోలను కూడా పంచుకున్నారు.