అజిత్ సింగ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చిరంజీవి
- కరోనాతో కన్నుమూసిన అజిత్ సింగ్
- అజిత్ సింగ్ తో అనుబంధాన్ని స్మరించుకున్న చిరంజీవి
- ఇద్దరం కేంద్ర మంత్రులుగా పనిచేశామని వెల్లడి
- అజిత్ సింగ్ రైతు పక్షపాతి అని వివరణ
అజిత్ సింగ్ రైతు పక్షపాతి అని చిరంజీవి కొనియాడారు. విమానయాన మంత్రిగా, ఆర్ఎల్ డీ పార్టీ అధినేతగా సమూల సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.