కరోనాతో కన్ను మూసిన కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరోనాతో కన్ను మూసిన కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి నారాయణరాజు

Legislative Secretary G Narayan Raju dies of Covid
  • ట్రిపుల్ తలాక్, సీఏఏ సహా పలు బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర
  • తొలి నాళ్లలో భీమవరంలో అధ్యాపకుడిగా పనిచేసిన వైనం
  • రెండేళ్ల క్రితమే రిటైరైనా సేవలు
ముఖ్యమైన బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర న్యాయశాఖ (శాసన) కార్యదర్శి డాక్టర్ జి.నారాయణరాజు కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొవిడ్ బారినపడి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకుని, తొలినాళ్లలో అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. 2015లో న్యాయశాఖలో చేరిన నారాయణరాజు శాసన వ్యవహారాల కార్యదర్శిగా, జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

నారాయణరాజు రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. అప్పటికి ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. రిటైర్ అయినప్పటికీ ఆయన సమర్థతను గుర్తించిన కేంద్రం మరో రెండేళ్లపాటు నారాయణరాజు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయన మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు.
G.Narayan Raju
Legislative Secretary
COVID19

More Telugu News