ఉప్పల్‌లో కంటైనర్‌కు మంటలు.. ఇద్దరి సజీవ దహనం
- శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు వెళ్తున్న కార్ల కంటైనర్
- మాడ్రన్ బెడ్ ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కంటైనర్
- డ్రైవర్, లోకల్ గైడ్‌కు మంటలు అంటుకుని మృతి
- పూర్తిగా కాలిపోయిన కంటైనర్లోని కార్లు
ఆ సమయంలో మాడ్రన్ బెడ్ ప్రాంతంలో వారి కంటైనర్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్తు తీగలు కంటైనర్‌పై పడ్డాయి. దీంతో అందులో మంటలు వ్యాపించి, ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కంటైనర్‌లోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.