తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదు... బీజేపీకి రాష్ట్రంలో చోటులేదు: ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy opines after Nagarjuna Sagar victory
నాగార్జునసాగర్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ తమ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించుకోవడం తెలిసిందే. దీనిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదని రెట్టించిన ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అదే సమయంలో బీజేపీకి రాష్ట్రంలో చోటు లేదని, కాంగ్రెస్ ఉనికే లేదని ఉద్ఘాటించారు. ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రెండు జాతీయ పార్టీలకు నాగార్జునసాగర్ ప్రజలు బుద్ధి చెప్పారని ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Indrakaran Reddy
Nagarjuna Sagar Bypolls
Nomula Bhagat
TRS
BJP
Congress
Telangana

More Telugu News