కంగ్రాచ్యులేషన్స్ మమతా దీదీ... బెంగాల్ లో మీదే ప్రభంజనం: సీఎం కేజ్రీవాల్
- బెంగాల్ లో కొనసాగుతున్న కౌంటింగ్
- 200 దాటిన టీఎంసీ ఆధిక్యం
- 77 స్థానాల్లో బీజేపీ ముందంజ
- ఏమి పోరాటం! అంటూ కేజ్రీవాల్ ప్రశంసలు
మధ్యాహ్నం 1.40 గంటల సమయానికి తృణమూల్ 210 స్థానాల్లో ముందంజ వేయడమే కాకుండా, ఒక స్థానంలో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో టీఎంసీతో హోరాహోరీ పోరు సాగించిన బీజేపీ... అధికార పక్షానికి దరిదాపుల్లో లేకున్నా గణనీయమైన స్థాయిలోనే ఉనికిని చాటుకుంటోంది. ఆ పార్టీ ప్రస్తుతం 77 స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక స్థానంలో నెగ్గింది.
అటు, నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీపై ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, ఆధిక్యం రౌండు రౌండుకు చేతులు మారుతోంది. దాంతో విజయంపై ఉత్కంఠ ఏర్పడింది.