Robbers: కూకట్ పల్లి ఏటీఎం దోపిడీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాదులో హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కాల్పులకు పాల్పడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం కూకట్ పల్లిలో ఏటీఎం వద్ద కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదుతో బైక్ పై పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే దోపిడీదారులను పట్టుకున్నారు. సంగారెడ్డి వద్ద వారిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది వీరి ముఠానే అని పోలీసులు గుర్తించారు.
Robbers
HDFC ATM
Hyderabad
SOT Police

More Telugu News