బెంగాల్ లో కొనసాగుతున్న చివరి విడత పోలింగ్.. బాంబు విసిరిన దుండగులు!
- చివరి విడతలో 35 నియోజకవర్గాలకు పోలింగ్
- ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు
- భద్రతా విధుల్లో 641 కంపెనీల కేంద్ర బలగాలు
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తర కోల్ కతాలోని మహాజతి సదన్ ఆడిటోరియం వద్ద దుండగులు బాంబు విసిరారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం... వెంటనే పూర్తి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించింది.
మరోవైపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 641 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ఆయన భార్య సుదేశ్ ధన్కర్ లు కోల్ కతాలోని చౌరంగీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.