లాక్ డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం
- గోవాలో రేపట్నుంచి మే 3 దాకా సర్వం బంద్
- అత్యవసరాలు, నిత్యవసరాలకు అనుమతి
- పారిశ్రామిక కార్యకలాపాలకూ పర్మిషన్
- ప్రజా రవాణా వ్యవస్థ నిలిపివేత
ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. కాసినోలు, హోటళ్లు, పబ్ లనూ పూర్తిగా మూసేస్తున్నట్టు వెల్లడించారు. నిత్యవసరాల రవాణా కోసం రాష్ట్ర సరిహద్దులను తెరిచే ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతం గోవాలో రోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 31 మంది చనిపోగా, 2,110 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో మొత్తంగా ఆ రాష్ట్రంలో 81,908 మంది కరోనా బారిన పడగా.. 1,086 మంది చనిపోయారు.