ముగిసిన కుంభమేళా... హరిద్వార్ లో కర్ఫ్యూ విధింపు!
- నిన్న జరిగిన చివరి షాహీ స్నాన్
- కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో
- కరోనాను కట్టడి చేస్తామన్న అధికారులు
కుంభమేళాలో భాగంగా చివరి షాహీ స్నాన్ ను భక్తులు లేకుండా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినా, మిశ్రమ స్పందనే లభించింది. స్వామి అవదేశానంద గిరి కుంభమేళా ముగిసిందని రెండు వారాల క్రితమే ప్రకటించినా భక్తులు పట్టించుకోలేదు. వేలాది మంది మంగళవారం నాడు పుణ్యస్నానాలు ఆచరించారు. మార్చి 3వ తేదీన కేవలం 451 రోజువారీ కేసులను నమోదు చేసిన ఉత్తరాఖండ్, ఇప్పుడు రోజుకు 39 వేల కొత్త కేసులను నమోదు చేస్తోంది. కుంభమేళా ముగిసిన నేపథ్యంలో కర్ఫ్యూ నిబంధనలను పక్కాగా అమలు చేయడం ద్వారా కేసులను కట్టడి చేస్తామన్న నమ్మకం ఉందని ఉత్తరాఖండ్ అధికారులు అంటున్నారు.