చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్!

Anchor Shyamala husband arrested
  • కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడంటూ ఒక మహిళ ఫిర్యాదు
  • లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని వెల్లడి
  • అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన రాయదుర్గం పోలీసులు
ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నర్సింహారెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అతనిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.

2017లో తన వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని... డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని... లైంగిక వేధింపులకు కూడా గురి చేశాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ చేసుకోవాలని మరో మహిళ కూడా రాయబారం నడిపిందని ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Anchor Shyamala
Husband
Narsimha Reddy
Arrest

More Telugu News