2 వారాలపాటు భారత్తో ఉన్న సరిహద్దుల మూసివేత: బంగ్లాదేశ్ ప్రకటన
- భారత్లో కరోనా కరాళనృత్యం చేస్తుండడంతో నిర్ణయం
- మంత్రి అబ్దుల్ ఒమెన్ ప్రకటన
- సరిహద్దుల వెంట జన సంచారాన్ని నిలిపివేస్తున్నాం
అలాగే, సరిహద్దుల వెంట జన సంచారాన్ని నిలిపివేయడంతో పాటు వాహన ప్రయాణాలను కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, దేశంలో ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడంతో పలు దేశాలు భారత్ నుంచి తమ దేశానికి కరోనా వ్యాప్తి చెందకుండా విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.