కారులో న్యూడ్ వీడియోలు తీశాడు... తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ పై నటి ఫిర్యాదు!
- భర్తతో విడిపోయిన జెన్నిఫర్
- ఆపై సహాయ దర్శకుడితో సహజీవనం
- డబ్బు కోసం వేధిస్తున్న నవీన్ కుమార్
ఈ క్రమంలో టీవీలకు కావాల్సిన సీరియల్స్ కు సహాయ దర్శకుడిగా పని చేస్తున్న నవీన్ కుమార్ దగ్గరయ్యాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్యా సహజీవనం కొనసాగింది. లాక్ డౌన్ కారణంగా నవీన్ కుమార్ కు పని పోవడంతో, డబ్బు కోసం జెన్నిఫర్ ను ఆశ్రయించాడు. అతని వేధింపులను జెన్నిఫర్ తట్టుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో ఆమె షూటింగ్ లో ఉండగా, అక్కడికి వచ్చిన నవీన్, ఆమెను బయటకు తీసుకెళ్లి, కారులో కూర్చోబెట్టి, న్యూడ్ వీడియోలు తీశాడు.
ఆపై బెదిరింపులకు దిగడంతో, విషయాన్ని అతని తల్లికి చెప్పింది. ఆమె ఏ మాత్రం పట్టించుకోకపోగా, తన కుమారుడు చెప్పినట్టుగా నడచుకోవాలని బెదిరించింది. దీంతో ఏం చేయాలో తోచని ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరిస్తున్నాడని, దౌర్జన్యం చేస్తున్నాడని, అతనిపైనా, ఆయన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలని కోరింది.