నెలసరి సమయంలో కరోనా టీకా తీసుకోవచ్చా?
- సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులు
- నెలసరికి 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత టీకా తీసుకోవద్దని దుష్ప్రచారం
- కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం
- ప్రచారంలో వాస్తవం లేదంటున్న వైద్యులు
18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెల 28 నుంచి కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయినప్పటికీ.. టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 29 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది.