కిడ్నాప్ గు గురైన ఎస్సై మురళిని చంపేసిన మావోయిస్టులు
- విడిపించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తుండగానే ఘాతుకం
- ప్రజాకోర్టు పెట్టి మురళిపై పలు అరోపణలు
- పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో లేఖ
ఈ సందర్భంగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను మావోలు వదిలివెళ్లారు. ఈ నెల మొదటి వారంలో పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మురళి ప్రమేయం ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ కిడ్నాప్ చేశారు.
చత్తీస్‌గఢ్‌లోని పలు గ్రామాల్లో అమాయక ఆదివాసీ గిరిజనులను హత్య చేయడంతోపాటు మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ప్రజా కోర్టు పెట్టి చంపేశామని పేర్కొన్నారు. కాగా, మురళిని విడిపించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడడం గమనార్హం.