కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు సీజ్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
- ఉలవపాడు వద్ద పోలీసుల తనిఖీలు
- ఆగకుండా వెళ్లిపోయిన కారు
- వెంబడించి పట్టుకున్న పోలీసులు
కారులో ఉన్న ప్రకాశం జిల్లా తెట్టు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వద్ద రూ. 25 లక్షలు, ఒంగోలుకు చెందిన శ్రీమన్నారాయణ వద్ద రూ. 40 లక్షలు లభించాయి. ఆ సొమ్ముకు సంబంధించి వారు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.