వెలవెలబోతున్న తిరుమల... 16 వేలకు తగ్గిన భక్తుల సంఖ్య!

Very Low Rush in Tirumala
  • మొన్నటి వరకూ 50 వేల మందికి దర్శనం
  • రూ. 1.98 కోట్లకు పడిపోయిన హుండీ ఆదాయం
  • గురువారం 16,412 మందికి దర్శనం
మొన్నటివరకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు, ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. కరోనా, లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్లు మూతపడిన ఆలయం, తిరిగి తెరచుకుని రోజుకు 50 వేల మందికి స్వామి దర్శనం కల్పించినప్పటికీ, ఇటీవలి కాలంలో పెరుగుతున్న కేసులు, మరోమారు ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. గురువారం నాడు స్వామివారిని కేవలం 16,412 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 1.98 కోట్ల ఆదాయం వచ్చిందని, 7,974 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News