సాయితేజ్ 'రిపబ్లిక్' రిలీజ్ వాయిదా?
- పొలిటికల్ డ్రామాగా 'రిపబ్లిక్'
- పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
- ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ జూన్ 4
ఇక ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెలలో థియేటర్లకు రానున్న కొన్ని సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఆ బాటలోనే 'రిపబ్లిక్' నడిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు.