మార్ఫింగ్ వీడియో కేసు.. దేవినేని ఉమ ఇంటికి సీఐడీ అధికారులు!
- టీడీపీ నేతకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు
- విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఇంటికి
- ఇంట్లో లేరని చెప్పిన కుటుంబ సభ్యులు
విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ అధికారులు ఉమామహేశ్వరరావుకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. దీంతో తొలుత పది రోజుల సమయం కావాలని ఉమ కోరారు. ఆ తర్వాత ఈ నెల 19న మరోమారు నోటీసులు పంపగా విచారణకు హాజరు కాలేదు. దీంతో నిన్న అధికారులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.