రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi wishes Rahul Gandhi a speedy recovery
  • దేశంలో ప్రమాదకర రీతిలో విజృంభిస్తున్న కొవిడ్
  • పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్న నేతలు
  • తాజాగా రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్
  • రాహుల్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానన్న మోదీ
ఇటీవల పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు, కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తదితరులు కూడా రాహుల్ త్వరగా ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షించారు.
Narendra Modi
Rahul Gandhi
Corona Virus
Positive
Speedy Recovery

More Telugu News