రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ

ఇటీవల పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు. లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు, కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తదితరులు కూడా రాహుల్ త్వరగా ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షించారు.


More Telugu News