వ్యాక్సిన్ వేయించుకుంటే ఉచితాలు, రాయితీలు ప్రకటించిన చైనా.... అయినా ముందుకు రాని జనాలు!
- కరోనాకు జన్మస్థానంగా చైనాకు గుర్తింపు
- వ్యాక్సిన్ తీసుకువచ్చిన చైనా
- టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపని చైనీయులు
- గుడ్లు, కూపన్లు ఇస్తామన్నా కనిపించని స్పందన
వ్యాక్సిన్ తీసుకున్నవారికి 3 కిలోల గుడ్లు ఉచితం అని, సూపర్ మార్కెట్ షాపింగ్ కూపన్లు ఫ్రీ అని ఊరిస్తోంది. రేషన్ సరకులపై రాయితీలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ జనాల్లో ఆశించిన మేర స్పందన రావడంలేదు. సుమారు 140 కోట్ల జనాభా కలిగిన చైనాలో ఇప్పటివరరకు టీకా వేయించుకుంది 19 కోట్ల మందేనట. దాంతో మిగతావారిని ఎలా వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకురావాలో అర్థంకాక అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంటోంది!