తెలంగాణలో భారీగా విస్తరిస్తున్న కరోనా.. ఒకే రోజు 6 వేల వరకు కొత్త కేసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో భారీగా విస్తరిస్తున్న కరోనా.. ఒకే రోజు 6 వేల వరకు కొత్త కేసులు!

Telangana registers 5926 new Corona cases in a single day
  • ఒకే రోజు  5,926 కొత్త కేసుల నమోదు
  • ఇదే సమయంలో 18 మంది మృతి
  • ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజే దాదాపు 6 వేల వరకు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. నిన్న 1,22,143 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 5,926 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 2,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరుకుంది. 3,16,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ  వివరాలను తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
Telangana
Corona Virus
Updates

More Telugu News