'అంటే .. సుందరానికీ!' షూటింగులో జాయినైన నజ్రియా
- వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని
- కథానాయికగా నజ్రియా పరిచయం
- సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
అలాంటి నజ్రియా తెలుగులో మొదటిసారిగా ఒక సినిమాను అంగీకరించింది .. ఆ సినిమా పేరే 'అంటే .. సుందరానికీ'. నాని కథానాయకుడిగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నజ్రియాను తీసుకున్నారు. ఈ రోజునే ఆమె ఈ సినిమా షూటింగులో జాయినైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. తెలుగులో తన ఫస్టు సినిమా 'అంటే .. సుందరానికీ' కనుక, తనకి ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.