నా వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నా: వీడియో విడుదల చేసిన తనికెళ్ల భరణి
- ఇటీవల ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టిన తనికెళ్ల
- అభ్యంతరాలు రావడంతో తొలగింపు
- ఎవరిపైనా వ్యతిరేకత లేదని వెల్లడి
కాగా, ఇటీవలి కాలంలో 'శభాష్ రా శంకరా...' అంటూ సామాజిక మాధ్యమాల్లో తనికెళ్ల పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పెట్టిన ఓ పోస్టులోని వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన, దాన్ని తొలగించినట్టు తెలిపారు. తనకు హేతువాదులు, మానవతావాదులు అంటే, గౌరవం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని అన్నారు. ఒకరిని నొప్పించే అధికారం ఎవరికీ లేదని, జరిగిన పొరపాటుకు తనను మన్నించాలని కోరుతున్నానని తెలిపారు.